ఆరోగ్యానికి దూరంగా
కేవలం రుచుల కోసం పాకులాడే మన భోజన అభిరుచులు మారాలి.
చురుకు దనానికి కారణమైన వ్యాయామానికి
బదులు మూర్తీభవించిన బద్దకానికి ప్రతిరూపమైన మన జీవనశైలి మారాలి.
నిర్మాణాత్మక విలువలను విసర్జించి
ఆలసత్వానికి ఆలవాలమవుతున్న మన ఆలోచనదోరణలు మారాలి.
పదవులు మాత్రమే మన వ్యక్తిగత విజయాలకి గుర్తులు అంటూ
వాటి కోసం ప్రాకులాడే మన అవకాశ వాద విధానాలు మారాలి.
పారిశ్రామిక విప్లవం వలన కలిగే ప్రమాదాల బారి నుండి
మన ప్రకృతిని కాపాడుకొనే విధంగా మన ప్రయత్నాలు మారాలి.
"మారాలి".."మారాలి" అంటూ కాగితం, కలం పట్టుకుని కవితలు వ్రాయడానికి బదులు
వ్రాసిన వాటిని కార్యాచరణ లో పెట్టడానికి మొదట నేను "మారాలి.."
Saturday, October 31, 2009
సర్వధారి సంవత్సరం
వచ్చింది వచ్చింది సర్వధారి..
మన కుటుంబాలలో సంతోషాన్ని నింపడానికి కావాలి అది ఓ సూత్రధారి.
వచ్చింది వచ్చింది సర్వధారి..
మన ఆశయాలికి , ఆశలకి పోయాలి అది ఊపిరి.
వచ్చింది వచ్చింది సర్వధారి..
మన లోని నిస్ఫ్రుహ,నిర్వేదలకు కావాలి అది ఓ సంహారి.
వచ్చింది వచ్చింది సర్వధారి..
మన పాపాలని కడిగి వేయడానికి కావాలి అది ఓ పుణ్య గోదావరి.
వచ్చింది వచ్చింది సర్వధారి..
సమస్య లతో సతమత మవుతున్న మన మనసు లని ఉల్లాస పరచడానికి కావాలి అది ఓ సంగీత లహరి.
వచ్చింది వచ్చింది సర్వధారి..
మన మంచి భవిష్యత్తు కు వేయాలి అది ఓ రహదారి.
వచ్చింది వచ్చింది సర్వధారి..
జరుగుతుంది ఇక మన జీవితాల లో శుభాలే మరి!

అధ్యాపకుని ఆత్మ ఘోష
ఉన్నత మైన ఆశయాలతో ఉపాధ్యాయ వృత్తిని చేపట్టాను..
కానీ భావి భారత పౌరులను ఉత్తమముగా తీర్చి దిద్ద లేక పోయాను.
విజ్ఞాన సారాన్ని దేశ భక్తి తో జోడించి మాతృభూమికి సేవ చేయమని భోదించాను..
కానీ పై చదువుల నెపంతో తన తల్లిని కాదని విదేశాల కెగిరి పోతారని ఊహించ లేక పోయాను.
శాంతికి సంకేతంగా తెల్లటి సుద్ద ముక్కను చేతబట్టి మానవతా విలువలను భోదించాను..
కానీ స్వార్థ రాజకీయ శక్తుల చేతుల్లో ఆయుధాలుగా మారి ఎర్రటి రక్తాని చిందిస్తారని ఊహించ లేక పోయాను.
పరాయి స్త్రీలు తల్లి తో సమానమని పదే పదే ప్రభోదించాను..
కానీ పదహారేళ్ళ పడచు పిల్ల కనపడినప్పుడు పళ్ళికిలిస్తూ వెకిలి చేష్టలు చేస్తుంటే చూస్తూ కూడా ఆపలేక పోయాను.
సుమతి శతకం, వేమన శతకం వేలకు వేల సార్లు వల్లె వేయించాను..
కానీ "సు" మతి లేని వాళ్ళకి అవి "వేమ" నే అన్న విషయాన్ని గ్రహించ లేక పోయాను.
ఇలా చెప్పుకుంటూ పోతే నా ఈ "కానీ" ల "కహాని" ఎన్నటిగి ఆగదు..
కానీ నా ఈ ఆత్మఘోష ఏ ఒక్కరి లో నైనను ఆలోచన భీజం నాటితే నాకంతే చాలు..

ఆఖరి వుత్తరం
మనసులోని భావాలతో ప్రతి పంక్తికి ప్రాణం పోసి
కలంలోని సిరా చుక్కలతో ప్రతి కాగితాన్ని నింపి
ఎన్నో వుత్తరాలను రాసాను నీకు నేస్తం!
నిరీక్షనలోనే కాలాన్ని గడిపేసాను.
అయినా నీలో చలనం లేదు.
నీ హృదయంలో నా స్నేహానికి ఇసుమంత స్థానం కూడా లేదు.
అందుకే మోడు వారిన మనసుతో రాస్తున్నా ఈ ఆఖరి వుత్తరం..
కలంలోని సిరా చుక్కలతో కాదు సుమా!
కళ్ళ నుండి కారే కన్నీటి చుక్కలతో ...

Monday, October 04, 2004
Subscribe to:
Posts (Atom)