"అన్న చదువుకోవాలి. బాగా చదువుకొని, మంచి ఉద్యోగం తెచ్చుకొని మనల్ని అందరిని బాగా చూసుకొంటాడు. అందుకని ఇంట్లోని పనులన్నీ నువ్వే చెయ్యాలి" అని చెప్పింది అమ్మ. "అలాగే అమ్మ " సమాధానమిచ్చా చిన్న కొడుకైన నేను. పలక పట్టుకోవడం మానేసి, పనులు చెయ్యడము మొదలుపెట్టా ... ******** అన్న బాగా చదువుకొని పెద్ద ఉద్యోగం తెచ్చుకొన్నాడు. నేను ఇంకా పని చేస్తూనే వున్నాను. అదీ అన్న ఆఫీస్ లోనే ఓ చిన్న ఉద్యోగి లా ...
పేరు చూసి కంగారు పడకండి.. ఏవో నాలుగు ప్రాస పదాలను ప్రయోగించి, మనసు దొంతరల లో దోబూచులాడే భావాల ని కవితల రూపం లో పెట్టడానికి చేసిన ప్రయత్నాలు మాత్రమే.