Skip to main content

చిన్న కొడుకు!

"అన్న చదువుకోవాలి. బాగా చదువుకొని, మంచి ఉద్యోగం తెచ్చుకొని మనల్ని అందరిని బాగా చూసుకొంటాడు. అందుకని ఇంట్లోని పనులన్నీ నువ్వే చెయ్యాలి" అని చెప్పింది అమ్మ.

"అలాగే అమ్మ " సమాధానమిచ్చా చిన్న కొడుకైన  నేను. పలక పట్టుకోవడం మానేసి, పనులు చెయ్యడము మొదలుపెట్టా ...

********

అన్న బాగా చదువుకొని పెద్ద ఉద్యోగం తెచ్చుకొన్నాడు.
నేను ఇంకా పని చేస్తూనే వున్నాను.  అదీ అన్న ఆఫీస్ లోనే  ఓ  చిన్న ఉద్యోగి లా ...


Comments

Popular posts from this blog

మారాలి ..

ఆరోగ్యానికి దూరంగా              కేవలం రుచుల కోసం  పాకులాడే  మన భోజన అభిరుచులు మారాలి . చురుకు దనానికి కారణమైన వ్యాయామానికి              బదులు మూర్తీభవించిన బద్దకానికి ప్రతిరూపమైన మన జీవనశైలి మారాలి. నిర్మాణాత్మక విలువలను విసర్జించి             ఆలసత్వానికి ఆలవాలమవుతున్న  మన ఆలోచనదోరణలు మారాలి. పదవులు మాత్రమే మన వ్యక్తిగత విజయాలకి గుర్తులు అంటూ             వాటి కోసం ప్రాకులాడే  మన అవకాశ వాద విధానాలు మారాలి. పారిశ్రామిక విప్లవం వలన కలిగే ప్రమాదాల బారి నుండి             మన ప్రకృతిని కాపాడుకొనే విధంగా  మన ప్రయత్నాలు మారాలి. "మారాలి".."మారాలి" అంటూ కాగితం, కలం పట్టుకుని కవితలు వ్రాయడానికి బదులు             వ్రాసిన వాటిని కార్యాచరణ లో పెట్టడానికి మొదట న...